Old telugu enugu lakshmana kavi images
మన పెద్దాపురం : ఏనుగు లక్ష్మణ కవి
--------------------------------------------------------------------------------------ఏనుగు లక్ష్మణ కవి గారు జన్మస్దలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది)
ఈయన క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు.
ఏనుగు లక్ష్మణ కవి గారి తల్లిగారి పేరు పేరమాంబ, మరియు తండ్రిగారి పేరుతిమ్మకవి.
శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాతగారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు".ఈయన ఒక ఏనుగును పోషించెవాడు.దానిని ఈయనకు పెద్దాపురం సంస్థాన పాలకులు బహుమతిగా యిచ్చారు.
అందుచే కాలక్రమేన వీరి యింటిపేరు ఏనుగు వారిగా స్దిరపడినది.
శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణ కవి గారి సమ కాలికుడు.
లక్ష్మణ కవి గారు, భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రి శతిని" తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదం చేసినాడు.
సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు.
భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు
1.
ఏనుగు లక్ష్మణ కవి
2. పుష్పగిరి తిమ్మన
3. ఏలకూచి బాల సరస్వతి. వీటన్నింటిలోను మిక్కిలి ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.
ఏనుగు లక్ష్మణ కవి గారి భర్తృహరి సుభాషిత నుండి
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
ఏనుగు లక్ష్మణ కవి గారి యితర రచనలు
1.రామేశ్వర మహత్యము.
2.రామ విలాసం
3.సూర్య శతకము.
4.లక్ష్మీనరసింహ శతకము.
5.గంగా మాహాత్మ్యము
ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ